భర్తపై కోపంతో పిల్లలకు వాతలు | Mother Tortures Children In Hyderabad | Sakshi
Sakshi News home page

భర్తపై కోపంతో పిల్లలకు వాతలు

Feb 27 2021 2:29 AM | Updated on Feb 27 2021 2:29 AM

Mother Tortures Children In Hyderabad - Sakshi

చిన్నారులకు వాతలు పెట్టిన దృశ్యాలు 

సాక్షి, సనత్‌నగర్‌(హైదరాబాద్‌): భర్తపై ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని కన్నపిల్లలపై ప్రదర్శించింది ఓ తల్లి. కట్టెతో కొట్టి, కర్రుకాల్చి వాతలు పెట్టింది. బాధను భరించలేక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించలేదు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండ రా మారావునగర్‌కు చెందిన రాజు, పావని భార్యభర్తలు. వీరికి జ్ఞానేశ్వర్‌(5), మహాలక్ష్మీ(4) సంతానం. ఈ నెల 23వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త మీద కోపంతో ఉన్న పావని విచక్షణ కోల్పోయి తన ఇద్దరు పిల్లలను కట్టెతో తీవ్రంగా కొట్టింది.

ఏడుస్తున్నా కనికరించకుండా పొయ్యిలో కాల్చిన గిన్నెతో చిన్నారుల తొడలు, అరికాళ్లపై వాతలు పెట్టింది. స్థానికులు అడ్డుకోగా ‘మా కుటుంబ విషయాలు మీకెందుకు’అంటూ విరుచుకుపడింది. అటుగా వెళ్తున్న అంగన్‌వాడీ టీచర్‌ గమనించి మేడ్చల్‌ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని లీగల్‌ సెల్‌ అధికారిణి సుజాత దృష్టికి తీసుకువెళ్లింది. ఆమె సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు చిన్నారులను తీవ్రంగా హింసించిన తల్లి పావనిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

చదవండి: (చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్‌ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య)

 

Advertisement
 
Advertisement
Advertisement