మూడేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన తల్లి 

Mother Behaved Cruelly Towards Daughter - Sakshi

కదిరి టౌన్‌: పసిపిల్లలు దేవుళ్లతో సమానమని భావిస్తాం.. బాధ్యతగా పెంచుతాం. అల్లారుముద్దుగా లాలిస్తాం.. అడిగిందల్లా కొనిస్తాం.. ఆటపాటలు నేర్పుతాం.. పరాయివాళ్లెవరైనా పల్లెత్తుమాటన్నా తల్లిదండ్రులు తట్టుకోలేరు. తల్లడిల్లిపోతారు. అవసరమైతే తగువుకు పోతారు. అభంశుభం తెలియని మూడేళ్ల పసిపాపపై కన్నతల్లే కర్కశత్వాన్ని ప్రదర్శించింది. చెప్పిన మాట వినలేదన్న సాకుతో చేతులు, కాళ్లకు కర్రుతో వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో చిన్నారి అలమటిస్తోంది. తల్లి పైశాచికత్వాన్ని చూసిన ప్రతి ఒక్కరూ నిందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన కదిరి పట్టణంలోని నారాయణమ్మ కాలనీలో శనివారం జరిగింది. చైల్డ్‌లైన్‌ 1098 అధికారులకు  ప్రజా సేవా సమాజ్‌ సమాచారం అందడంతో పట్టణ పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ, గ్రామ సచివాలయ అధికారులు ఆ ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. చిన్నారికి కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top