భార్యాభర్తలు వాట్సాప్‌ చాటింగ్‌.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్‌.. | Married Woman Suspicious Death In West Godavari | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలు వాట్సాప్‌ చాటింగ్‌.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్‌..

Dec 18 2021 6:00 PM | Updated on Dec 18 2021 7:17 PM

Married Woman Suspicious Death In West Godavari - Sakshi

తణుకు(పశ్చిమగోదావరి): పట్టణానికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పుష్పలత (21) శుక్రవారం మధ్యాహ్నం ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత, విజయవాడకు చెందిన సాయిబాలచందు ఈ ఏడాది జనవరి 9న ప్రేమవివాహం చేసుకున్నారు.

చదవండి: నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి..

సోషల్‌ మీడియా యాప్‌లో పరిచయంతో వీరు వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలచందు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. పుష్పలత గృహిణి. శుక్రవారం ఉదయం నుంచి భార్యాభర్తలు వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన బాలచందు మరో గదిలో ఉండగా పడక గదిలో ఆమె ఉరేసుకుంది. అయితే ఘటనా స్థలంలో ఆనవాళ్లు ప్రకారం ఆమె ఉరేసుకున్నట్లుగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కె.గంగాధరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.     

Advertisement
 
Advertisement
Advertisement