
ప్రేమికులు చందన, సతీష్ (ఫైల్)
సాక్షి, దొడ్డబళ్లాపురం: వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర తాలూకా కబ్బాళు పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఉరుగ్యం గ్రామానికి చెందిన చందన (20), సతీష్ (24) పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే చందన తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించలేదు.
కనకపుర తాలూకా దొడ్డమరళ్లికి చెందిన గణేశ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో చందన, సతీష్ కనకపురలోని కబ్బాళు పుణ్యక్షేత్రంలో కొండమీద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చందన నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి సాతనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: (సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో)