బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Maoist Encounter In Galwan Forest Bijapur Chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా గల్గాం అడవిలో మంళవారం ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి.

ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్‌ అఖిలేష్‌ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top