కూతురి నిర్వాకం... అవమానంతో అత్యంత దారుణానికి పాల్పడ్డ తండ్రి | Man Assassination Family And Self Daughters Inter Cast Marriage | Sakshi
Sakshi News home page

కూతురి నిర్వాకం... అవమానంతో అత్యంత దారుణానికి పాల్పడ్డ తండ్రి

Feb 18 2022 3:02 PM | Updated on Feb 18 2022 3:11 PM

Man Assassination Family And Self Daughters Inter Cast Marriage - Sakshi

కూతురు కులాంతరం విహం చేసుకుందని కలత చెందిన తం‍డ్రి అత్యంత దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు.

Upset over his daughter Inter Cast Marriage: ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కులాంతర వివాహలను అంగీకరించటం లేదు. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అంతగా మార్పు రావడం లేదు. పలు చోట్ల కులాంతర వివాహం చేసుకున్న వాళ్లను చంపడం లేదా కోపంతో ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... "తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో లక్ష్మణ్‌ అనే వ్యక్తి టీ దుకాణం నడుపుతున్నాడు. అయితే అతని పెద్ద కూతురు షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో లక్ష్మణ్‌ ఆగ్రహం చెందాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తన భార్య, ఇద్దరు కూమార్తెలను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు." అని తెలిపారు.

ఈ మేరకు పోలీసు సూపరింటెండెంట్ జి జవహర్ మాట్లాడుతూ..."దుకాణం నడుపుతున్న లక్ష్మణ్‌ తన పెద్ద కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నాడు.  అందువల్లే అతను ఈ ఘటనకి పాల్పడ్డాడు. అయితే అతని పెద్ద కూతురు తన భర్త వద్ద క్షేమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అని చెప్పారు. 

(చదవండి: మహిళతో వివాహేతర సంబంధం..  నాలుగేళ్ల చిన్నారిపై పైశాచికం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement