రాజవంశానికి చెందిన వాడినంటూ మహిళలకు వల...చివరికీ..

Man Arrested Allegedly Women By Pretend To Royal Family At Mumbai - Sakshi

రాజకుటుంబానికి చెందిన వాడినంటూ ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో మహిళలను ట్రాప్‌ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. చివరికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ముంబైకి చెందిన రాజ్‌వీర్‌ సింగ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో తనను తాను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందిన వాడిగా పరిచయం చేసుకుంటూ పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఒక మహిళా అతడిపై ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన గోరెగావ్‌ పోలీసులు అతన్ని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో పట్టుకుని అరెస్టు చేశారు. అతను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందినవాడిగా నటించి అమ్మాయిల నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేవాడో వివరించారు. ఇప్పటి వరకు అతడు బాధిత మహిళ నుంచి సుమారు రూ. 13 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాజ్‌వీర్‌ సింగ్‌పై ఇప్పటికే జుహు పోలీస్టేషన్‌లో కేసు నమోదైందని, అతను ఒక ఏడాదిపాటు జైల్లో ఉండి వచ్చాడని చెప్పారు. ఐతే ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా మరో మహిళను వేదించడమే కాకుండా ఆమె ఎనిమిదేళ్ల కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. 

(చదవండి: అమానుష ఘటన: విద్యార్థికి డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్‌ ఇచ్చిన టీచర్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top