టీవీ చూసేందుకు రమ్మని పిలిచి.. బాలికపై దారుణం

Man Accused Of Molesting 12 Year Old Girl In Srikakulam District - Sakshi

గర్భం దాల్చినట్లు నిర్ధారించిన వైద్యులు

పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

నిందితుడి అరెస్టు   

జి.సిగడాం(శ్రీకాకుళం జిల్లా): అభం..శుభం తెలియని పసి మొగ్గపై కీచకుడు కన్నేశాడు. 12 ఏళ్ల వయసు దాటని బాలిక ను భయపెట్టి.. మాయమాటలు చెప్పి లోబర్చుకు న్నాడు. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి ఇప్పుడు ఆరు నెలల గర్భిణి. తమ కుమార్తెలో శారీరకంగా అవయవాల మార్పును గుర్తించిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వైద్యులను సంప్రదించడంతో విష యం వెలుగు చూసింది. చివరకు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నిజాన్ని రాబట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం గెడ్డకంచరాంలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడ్డకంచ రాం గ్రామానికి చెందిన లొట్ట అనిల్‌ (26) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలిక కుటుంబం కూడా నిరుపేదలు. వారి ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న డొంక సవ రయ్య గృహానికి వెళ్తుండేది. ఈ విషయాన్ని గమనించిన అనిల్‌ బాలికకు మాయ మా టలు చెప్పాడు. తన ఇంట్లో ఉన్న టీవీ చూసేందుకు వస్తే నచ్చిన చానల్‌లో.. ఇష్టమైన ప్రోగ్రాం చూసుకోవచ్చని నమ్మించాడు. దీంతో అనిల్‌ మాటలను నమ్మిన చిన్నారి.. అతని ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లేది. దీన్ని అనుకూలంగా మలుచుకున్న అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో చిన్నారి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ విష యం కూడా ఆమెకు తెలియలేదు. కరోనా నేపథ్యంలో వలస వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు తన కుమార్తెలో వచ్చిన శారీక మార్పులతో ఆందోళన చెందారు. రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్ష లు చేసిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించడంతో నివ్వెరపోయారు. ఇంటికి వచ్చేసి ఏం జరిగిందంటూ ఆరా తీశారు. అనిల్‌ టీవీ చూసేందుకు రమ్మని చెప్పి.. బలవంతం చేసినట్టు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో శుక్రవారం జి.సిగ డాం పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.ఎ.అహ్మద్‌ కేసు నమోదు చేసి.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. యువకుడిని అరెస్టు చేశామని ఎస్‌ఐ చెప్పారు.

చదవండి: దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..  
ఫేస్‌బుక్‌ పరిచయం.. బాలికపై ప్రైవేటు టీచర్‌ లైంగికదాడి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top