నీ కూతురు దొరకాలంటే 40 వేలు ఇవ్వు!

Maharashtra: Cop Demands Rs 40000 From Man To Find His Missing 17 Year Old Daughter - Sakshi

ముంబై: తప్పిపోయిన తన కూతురుని వెతికి అప్పగించాలని బాధతో పోలీస్​స్టేషన్​కు వెళ్లిన ఒక తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు, బీడ్​ జిల్లా లోని బేలురా గ్రామానికి  చెందిన సదరు తండ్రి తన 17 ఏళ్ల కూతురు తప్పిపోయిందని స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు స్టేషన్​ చుట్టు తిరిగేవాడు.

ఈ క్రమంలో, ఒక రోజు స్టేషన్​ అసిస్టెంట్​ ఇన్‌స్పెక్టర్‌ అనిల్​ గవాంకర్​ అనే అధికారి ఒక మధ్య వర్తి ద్వారా 40,000 రూపాయలను లంచంగా డిమాండ్​ చేశారు. డబ్బు ఇస్తేనే నీ కూతురు దొరుకుతుందని  మధ్యవర్తి ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ బాలిక తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను, పేదవాడినని అంత డబ్బుఇవ్వలేనని వేడుకున్నాడు. మధ్య ర్తి మాత్రం డబ్బులిస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పాడు. దీంతో, బాలిక తండ్రి అప్పుచేసి మొదటగా, 15,000 వేలను చెల్లించాడు. ఎలాగైనా తన కూతురుని వెతికివ్వాలని ప్రాధేయపడ్డాడు. ఎనిమిది రోజులు గడుస్తున్న ఎలాంటి పురోగతి లేదు. మధ్యవర్తి మరో 10,000 ఇవ్వాలని కోరాడు. పాపం, ఆ తండ్రి అదికూడా ఇచ్చాడు. అయినా తన బాలిక ఆచూకి మాత్రం లభించలేదు.

ఇక లాభం లేదని విసిగెత్తి పోయిన ఆ తండ్రి బీడ్​ జిల్లా ఎస్​పీని సంప్రదించాడు. తన కూతురు తప్పిపోయిన విషయాన్ని, పోలీస్​ అధికారి డబ్బులు డిమాండ్​ చేయడాన్ని ఎస్​పీకి వివరించాడు. తన దగ్గర ఉన్న సెల్​ ఫోన్​ రికార్డులను ఎస్​పీకి చూపించాడు.  ఆ పోలీస్​ అధికారిపై చర్యలు తీసుకొని ఎలాగైనా తన కూతురుని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.దీనిపై స్పందించిన ఎస్​పీ,  బేలూరా ఇన్స్​పెక్టర్ పై విచారణ జరపటానికి గవ్​ హంకర్​ అనే మరో పోలీస్​ అధికారిని నియమించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని గవ్​హంకర్​ను ఆదేశించారు. 

చదవండి: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top