ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ | UP Girl Reaches Boyfriend House With Wedding Band And Threatens Suicide | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ

Published Fri, Jun 4 2021 3:51 PM | Last Updated on Fri, Jun 4 2021 4:24 PM

UP Girl Reaches Boyfriend House With Wedding Band And Threatens Suicide	 - Sakshi

లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​తో పాటు, కరోనా నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నాయి. అయితే, అనేక ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న కొన్ని పెళ్లిళ్లు ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక యువతి తాను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు చేసిన రచ్చ వార్తల్లో నిలిచింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లో చోటుచేసుకుంది. గోరఖ్​పూర్​కు చెందిన సదరు యువతి, సందీప్​ మౌర్యలు  రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

 వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ఆమె బంధువుల ఇంట్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమ కొనసాగుంది. సందీప్​ కూడా తరచుగా ఆ యువతి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో, సందీప్​కు భారత సైన్యంతో ఉద్యోగం వచ్చింది. అయితే, అప్పటి నుంచి ఆ యువకుడు యువతిని పట్టించుకోవడం లేదు. కాగా, సందీప్​కు అతని కుటుంబ సభ్యులు, వేరే అమ్మాయితో వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం సదరు యువతికి  తెలిసింది. 

వెంటనే, ఆమె ‘ పెళ్లి బాజా, భజంత్రీలు, బరాత్​.. తన మిత్రులు, బంధువులతో కలిసి ప్రియుడి ఇంటి ముందుకు చేరుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్యాండ్​ వాయిస్తు రచ్చ చేసింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందర గోళ పరిస్థితి ఏర్పడింది.  కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సముదాయించడానికి ప్రయత్నించారు.  ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్లనని భీష్మీంచుకుని కూర్చుంది.

‘ తాను, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి’ చెప్పింది. తనను.. ప్రేమ పేరుతో శారీరకంగా  కూడా వాడుకుని  .. ఇప్పుడిలా మోసం చేస్తున్నాడని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంత మయ్యింది.  అయితే, పోలీసులు కాసేపటి తర్వాత ఆ యువతిని ఆమె ఇంటికి తరలించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు  సందీప్​ను మౌర్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు పలు సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.  

చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్​.. వైరల్​ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement