పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్​.. వైరల్​ వీడియో | Hilarious Video: Bride Throws Flowers On Groom Face With Attitude Goes Viral | Sakshi
Sakshi News home page

పెళ్లిలో వధువు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు!

Jun 3 2021 2:38 PM | Updated on Jun 3 2021 9:27 PM

Hilarious Video: Bride Throws Flowers On Groom Face With Attitude Goes Viral	 - Sakshi

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ఈ నిబంధనలు వివాహాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఎంతో ఆడంబరంగా, బంధువులు, స్నేహితుల సమక్షంలో  జరగాల్సిన వేడుక  కాస్తా కొద్ది మంది సమక్షంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. 

అయితే, లాక్​ డౌన్​ పుణ్యామా అని ఇటీవల జరిగిన అనేక పెళ్లిళ్లలో ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుండగా దానికి సంబంధించిన క్లిప్పింగ్‌లు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇక్కడ చెప్పుకునే పెళ్లి వేడుక కూడా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెళ్లిలో వధువు, తన చేతిలో కొన్ని పువ్వులను పట్టుకుని స్టేజీ మీదకు ఎక్కి కాబోయే వరుడి ముందుకు వెళ్లి నిలుచుంది.

సాధారణంగా ఆ పువ్వులను వరుడి తల మీద కానీ లేదా పాదాల మీద గానీ వేస్తుందనుకున్నారంతా! కానీ, అనూహ్యంగా ఆమె కోపంతో తన చేతిలోని పువ్వులను వరుడి ముఖం మీదకు విసిరి కొట్టింది. ఊహించని చర్యతో షాకైన వరుడు ఏంచేయాలో అర్థంకాక బిత్తర ముఖం పెట్టుకొని అలాగే నిల్చుండిపోయాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ అమ్మాయికి పెళ్లంటే ఇష్టం లేదేమో’, ‘అయినా, ఇదేం ఆటిట్యూట్’​, ‘ ఇంకా.. నయం వరుడిని కొట్టలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో వరుడు వెరైటీగా వధువు కాళ్లకు దండం పెట్టగా, మరో వివాహంలో వధువు, వరుడు బాటిల్‌తో ఆడుకున్నారు. ఇంకో పెళ్లిలో కొత్త పెళ్లికూతురు ఏకంగా స్టేజీపై తుపాకీని కాల్చడం వంటి ఘటనలు కూడా వైరల్​గా మారిన సంగతి తెలిసిందే!

చదవండి : పెళ్లిలో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు.. ఎందుకో తెలుసా

Advertisement
 
Advertisement
Advertisement