న‌ల్గొండలో ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌ | Lovers Consume Poision At A farm In Nalgonda District | Sakshi
Sakshi News home page

యువ‌కుడికి ఇదివ‌ర‌కే పెళ్లి..

Sep 9 2020 11:50 AM | Updated on Sep 9 2020 11:55 AM

Lovers Consume Poision  At A  farm In Nalgonda District - Sakshi

న‌ల్గొండ :  వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప్రేమికులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న నల్లగొండ జిల్లా  కేతపల్లి మండలంలో చోటుచేసుకుంది. క్రిమిసంహార‌క మందుతాగి ఇద్ద‌రూ ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డారు.  ఈ ఘ‌ట‌న‌లో ప్రియుడు అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువ‌తిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే యువ‌కుడికి ఇదివ‌ర‌కే వివాహం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ మ‌రొక యువ‌తితో ప్రేమాయ‌ణం న‌డుపుతూ వ‌చ్చాడు. ఈ ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఏంటో ఇంకా తెలియ‌రాలేదు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాల‌ను బంధువుల‌కు అప్ప‌గిస్తామ‌ని వెల్ల‌డించారు.  (వేధింపులు.. సీరియల్‌ నటి ఆత్మహత్య)

Advertisement
 
Advertisement
Advertisement