లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్సై

Jagtial SI Caught By ACB For Taking 30k Bribe - Sakshi

రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై డ్రైవర్‌

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకృష్ణ, డ్రైవర్‌ రవిపై కేసు 

సాక్షి, జగిత్యాల: బెయిల్‌ మంజూరుకు ఓ వ్యక్తి నుంచి జగిత్యాల పట్టణ ఎస్సై రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణం విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన బెజ్జారపు అఖిలకు గత డిసెంబర్‌ 28న మెట్‌పల్లి పట్టణం చైతన్యనగర్‌కు చెందిన బెజ్జారపు శివ ప్రసాద్‌తో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అఖిలను భర్తతో పాటు మామ భూమయ్య, అత్త నాగమణి, బావ రాజేశ్, ఆడబిడ్డ భాగ్య వేధించగా, బాధితురాలి సోదరి కట్ట మౌనిక పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మార్చి 30న అప్పటి ఎస్సై శంకర్‌నాయక్‌ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి బెయిల్‌ ఇచ్చారు.

అయితే ఇటీవల పట్టణ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శివకృష్ణ, బాధితులకు ఫోన్‌ చేసి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో కేసులో ఎ–4 గా ఉన్న బెజ్జారపు రాజేశ్‌ రూ. 30వేలు ఇచ్చేలా ఎస్సైతో ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు రాజేశ్‌ గురువారం మధ్యాహ్నం డబ్బుతో జగిత్యాల పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఎస్సై శివకృష్ణకు ఫోన్‌ చేయగా, తన డ్రైవర్‌ రవికి ఇవ్వాలని చెప్పాడు. డ్రైవర్‌ రవికి రూ.30 వేలు ఇస్తుండగా కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ  ద్రయ్య, సీఐలు రాము, సంజీవ్, రవీందర్, తిరుప తి, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అక్కడే ఉన్న ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడితో ఎస్సై ఫోన్‌లో మాట్లాడిన వాయిస్‌ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఏసీబీ డీఎ స్పీ మాట్లాడుతూ, ఎస్సై శివకృష్ణ ఓ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరైనా తిరిగి రిమాండ్‌కు పంపుతానని బెదిరించి రూ.50 వేలు డి మాండ్‌ చేశాడని, ఒప్పందం ప్రకారం బాధితులు ఎౖ స్సె డ్రైవర్‌కు రూ.30 వేలు ఇస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎస్సైతో పాటు రవిని కరీంనగర్‌ ఏసీ బీ కా ర్యాలయానికి తరలించి విచారణ పూర్తి చేసి శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. 

అయితే, పట్టుబడ్డ అనంతరం ఎస్సై విపరీతంగా బాధ పడ్డారు. తన పరువు పోతుందని ఏడ్చేశారు. బల్లపై ముఖం దాచుకొని మరీ వెక్కివెక్కి ఏడ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎస్సై ఇంట్లో సోదాలు..
ఏసీబీకి పట్టుబడిన ఎస్సై శివకృష్ణ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కొన్ని విలు వైన వస్తువులతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

చదవండి: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top