నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

Hyderabad Police Arrested Fake Land Documents Fraud Gang - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జయ దశరథ ప్రాజెక్ట్‌ పేరుతో ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి భూములు విక్రయించి..మోసాలకు పాల్పడుతోంది. వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మోసం చేయడంలో ముఠా దిట్ట అని తెలిపారు. గొల్లూరు గ్రామంలో నకిలీ పత్రాలతో 40 ఎకరాల భూమిని ముఠా విక్రయించినట్లు సీపీ తెలిపారు. డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేయకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారని.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

చదవండి: చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం
ఏమిటి జోకర్‌ యాప్స్‌.. బహుపరాక్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top