పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లి | Hyderabad: Young Man Molested Minor Girl At Kalapathar | Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లి

Jun 6 2022 9:30 AM | Updated on Jun 6 2022 9:43 AM

Hyderabad: Young Man Molested Minor Girl At Kalapathar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడిచేసిన ఓ యువకుడిని కాలాపత్తర్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక(16) చార్మినార్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌ గర్ల్‌. లంగర్‌హౌజ్‌ మొఘల్‌నగర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సుఫియాన్‌(21) అక్కడే ఈవెంట్‌ మేనేజర్‌. గతనెల 30న బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లంగర్‌హౌజ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడిచేశాడు.

అనంతరం 31వ తేదీన వస్త్ర దుకాణం వద్ద బాలికను వదిలిపెట్టి ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో బాలిక లైంగికదాడి విషయాన్ని చెప్పింది. దీంతో తల్లి కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్, లైంగికదాడి కేసులను నమోదు చేసి మహ్మద్‌ సుఫియాన్‌ను అరెస్ట్‌ చేశారు.   
చదవండి: ఆటో డ్రైవర్‌ నకిలీ పోలీస్‌గా.. అత్యాచార, చోరీ కేసులున్నాయంటూ 

Advertisement
 
Advertisement
Advertisement