ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య | hyderabad: teenage girl ends her life jubilee hills | Sakshi
Sakshi News home page

Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

Sep 30 2021 7:05 AM | Updated on Oct 1 2021 6:47 AM

hyderabad: teenage girl ends her life jubilee hills - Sakshi

ఆలస్యంగా తెలుసుకున్న అనురాధ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. రెండు రోజుల క్రితం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తుండగానే మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడనే కారణంతో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో కావలి అనురాధ(22) జూనియర్‌ ఆర్టిస్ట్‌. కిరణ్‌ అనే యువకుడితో అదే బస్తీలో గది అద్దె కు తీసుకొని ఆరేళ్లుగా సహజీవనం చేస్తోంది.

ఇటీవల కిరణ్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని అనురాధ వద్ద దాచి పెట్టాడు. సోదరి సరోజ ఫిర్యాదు మేరకు ఆలస్యంగా తెలుసుకున్న అనురాధ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. రెండు రోజుల క్రితం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

చదవండి: మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని..

Advertisement
 
Advertisement
Advertisement