రాత్రి భోజనం చేసి నిద్రపోయింది.. ఉద‌యం లేచి చూసేస‌రికి..

Hyderabad: Minor Girl Goes Missing In Vengal Rao Nagar - Sakshi

సాక్షి, వెంగళరావునగర్‌( హైద‌రాబాద్‌): రాత్రి భోజనం చేసి నిద్రించిన కుమార్తె ఉదయానికి కనిపించలేదంటూ మైనర్‌ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బోరబండ ఔట్‌పోస్ట్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. బోరబండ డివిజన్‌ పరిధిలోని వినాయకరావునగర్‌లో చల్లా రాము, చల్లా రత్నా దంపతులు తమ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఈనెల 13వ తేదీ రాత్రి అందరూ భోజనం చేసి ఇంట్లో నిద్రించారు.

14వ తేదీ ఉదయం లేచి చూడగా పెద్ద కుమార్తె కనిపించలేదు. ఆమె ఫోన్‌తో పాటుగా ఇంట్లో ఉండాల్సిన రూ.12వేలు కూడా కనబడలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారితో పాటుగా బందువులందరినీ విచారించారు. అయినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దాంతో బోరబండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top