Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 34 ఏళ్ల మహిళ భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీకి చెందిన సురేష్ కచువాతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్నాడు.
ఈ నెల 8న ఆమెతో గొడవ పడి వెళ్లగా ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సనత్‌నగర్‌లోని అతడి ఇంటికి వెళ్లింది. సురేష్ తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్‌మెయిల్)