గచ్చిబౌలి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య 

Hyderabad: Fashion Designer Commits Suicide in Gachibowli - Sakshi

సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య  చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన ఆర్మీ రిటైర్డ్‌ అధికారి సుకుమార్‌ జితేందర్‌నాథ్‌ మండల్‌ పెద్ద కూతురు శతాబ్ధి మండల్‌(32) కొంత కాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసి ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తోంది. 2020 ఆగస్టులో గచ్చిబౌలిలో  నివాసం ఉంటోంది. షేరింగ్‌ ఫ్లాట్‌లో ఉండే డాక్టర్‌ ప్రియాంక రెడ్డి, గీత మాధురిలు నవంబర్‌ 28న బయటకు వెళ్లారు. తిరిగి 30న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఫ్లాట్‌లోకి రాగానే దుర్వాసన రావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్‌ ఎంతో తెలుసా?

మాస్టర్‌ కీతో తలుపులు తెరిచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు చున్నీ తో ఉరి వేసుకొని ఉంది. మృతదేహం కుళ్లి పోయిన స్థితిలో ఉండగా పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి సుకుమార్‌ చిన్న కూతురుతో కలిసి గుజరాత్‌లో ఉంటున్నారు. పెద్ద కుమార్తె మరణ వార్త విని హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. మృతదేహన్ని తండ్రికి అప్పగించారు. షేరింగ్‌ ఫ్లాట్‌లో ఉండేవారు బయటకు వెళ్లిన రోజే శతాబ్ధి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, గచ్చిబౌలి:  ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బర్చండి గ్రామం, నవరంగాపూర్‌ జిల్లా, ఒడిశాకు చెందిన దేబాండ రాయ్, బిజాలీ రాయ్‌ దంపతులు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇందిరానగర్‌లో నివాసం ఉంటూ వంట పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె దీప్తి రాయ్‌(17) చందానగర్‌లోని చైతన్యభారతి కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈక్రమంలో బుధవారం ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులు వంట చేసేందుకు బయటకు వెళ్లారు. తిరిగి ఉదయం 11 గంటలకు వచ్చి చూసే సరికి కూతురు దీప్తి  ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరితోను పెద్దగా మాట్లాడేది కాదని, సెల్‌ ఫోన్‌తోనే గడిపేదని తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు తెలిపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీప్తి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top