ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయని .. ‍మైనర్‌ కుమార్తెలను..

Husband Assasinate His Minor Doughters In Uttarpradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదే్‌శ్‌లో విషాదం చోటు చేసుకుంది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రానన్నందుకు కోపంతో.. సదరు భర్త తన మైనర్‌ కుమార్తెలను అతిదారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్‌ జిల్లాలోని అనూప్‌ నగర్‌లో జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫజల్‌ పూర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ కుమార్‌, జానీ భార్యభర్తలు. వీరికి ఆరేళ్లు, నాలుగెళ్లు ఉన్నఇద్దరు కుమార్తెలు. కాగా,  ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భర్త, భార్య జానీని తరచు వేధించేవాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. గత వారంలో వీరు ఉంటున్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. దానిలో కొన్ని ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, ఖరీదైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కాస్త ఎక్కువయ్యాయి. దీంతో జానీ, తన పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అరుణ్‌ మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం (13 ఆగస్టు)న జానీ ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడు. అయితే, దీనికి భార్య నిరాకరించింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో, మద్యం మత్తులో ఉన్న అరుణ్‌.. విచక్షణ కోల్పోయి తన బిడ్డలను కత్తితో హత్యచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top