మహిళ నుంచి రోజూ ఫోన్‌, వాట్సప్‌ మెసేజ్‌లు.. ఉదయం భవనానికి వెళ్లి చూస్తే..

Haveri Court Employee Suicide Over Employee Harassment Karnataka - Sakshi

యశవంతపురల(బెంగళూరు): హావేరి జిల్లా హిరేకెరూరు పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆదివారం రాత్రి కోర్టులో శిరస్తేదారుగా పని చేస్తున్న మల్లికార్జున భరగి (42) ఆత్మహత్య చేసుకున్నాడు. బాగలకోటె జిల్లా బాదామి తాలూకా కటగేర గ్రామానికి చెందిన మల్లికార్జున 13 ఏళ్లుగా హిరేకెరూరులో ఉంటూ కోర్టులో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

నలుగురి నుంచి వేధింపులు  
హసీనా మూలిమని అనే మహిళ రోజూ మల్లికార్జునకు ఫోన్‌ చేయడం, వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతూ అతన్ని వేధిస్తుండేది. ఆమెతో పాటుగా న్యాయవాది జీవీ కులకర్ణి, కేజీ కురియవరు, వసీంలు కోర్టులో మానసికంగా వేధిస్తున్నారు. దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎన్‌జీఓ భవనానికి వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. నా మరణానికి ఆ నలుగురే కారణం అని మల్లికార్జున వాట్సప్‌ స్టేటస్‌ పెట్టాడు. అతని వద్ద  26 పేజీల డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

చదవండి: ఫుడ్‌ డెలివరీకి వెళ్లి యువతికి బలవంతంగా ముద్దు.. డెలివరీ బాయ్‌ అరెస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top