ఫుడ్‌ డెలివరీకి వెళ్లి యువతికి బలవంతంగా ముద్దు.. డెలివరీ బాయ్‌ అరెస్ట్‌

Forcibly Kissing Girl Customer Zomato Delivery Man Arrest In Pune - Sakshi

ముంబై: ప్రస్తుత రోజుల్లో కోరుకున్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే ఇంటికి చేరవేస్తున్నాయి పలు సంస్థలు. కరోనా వ్యాప్తి తర్వాత చాలా మంది యాప్‌ల ద్వారా ఇంటికే ఫుడ్‌ తెప్పించుకుంటున్నారు. అయితే.. ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్స్‌ దుశ్యర్యలకు పాల్పడుతూ కటకటాల పాలైన పలు సంఘటనలు చూసే ఉంటారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలుగు చూసింది. యేవెల్వాడీ ప్రాంతంలో ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ 42 ఏళ్ల డెలివరీ మ్యాన్‌.. 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. 

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్‌ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది. దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్‌ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్‌ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ముందుగా బాధితురాలు బయపడింది. ఈ సంఘటన సెప్టెంబర్‌ 17న రాత్రి 9.30 గంటలకు జరిగింది. బాధితురాలి ఇంటి నుంచి వెళ్లిన డెలివరీ బాయ్‌.. ఆమెకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. ఎలాంటి సాయం కావాలన్న అడగాలని చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ బాయ్‌ని అరెస్ట్‌ చేయగా.. తర్వాత బెయిల్‌పై విడుదలైనట్లు సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్దార్‌ పాటిల్‌ తెలిపారు.

ఇదీ చదవండి: వీడియో: ఘోరం.. మరుగుదొడ్డిలో కబడ్డీ ప్లేయర్స్‌కు భోజనం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top