బిహార్‌లో హైదరాబాద్‌ పోలీసులపై కాల్పులు | gunfire on hyderabad police in bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో హైదరాబాద్‌ పోలీసులపై కాల్పులు

Aug 14 2022 11:04 PM | Updated on Aug 15 2022 5:02 AM

gunfire on hyderabad police in bihar - Sakshi

ఓ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసేందుకు ఈనెల 11న హైదరాబాద్‌ పోలీసులు బిహార్ వెళ్లారు. స్థానిక నవాడ పోలీసుల సహాయంతో నిందితులను చాకచక్యంగా అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ క్రైమ్‌ కేసులో నేరస్తులైన కొందర్ని బిహార్‌ నుంచి నగరానికి తీసుకువస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్‌ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌కు చెందిన మిథిలేశ్‌ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి సైబర్‌ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురిని నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బిహార్‌లోని నవాడాకు వెళ్లారు.

నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగుర్ని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా, అప్పటికే పోలీసులు మిథిలేశ్‌ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.   

చదవండి: రిక్షా డ్రైవర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ

Advertisement
 
Advertisement
Advertisement