ఉరితాడైన ఊయల

A Girl Succumbed Due To Hammock Tight To Neck - Sakshi

కోలారు: ఊయల ఊగుతూ చీర గొంతుకు చుట్టుకుని ఉరితాడై బాలిక మరణించిన ఘటన ముళబాగిలు తాలూకా నంగలి ఫిర్కా పెద్దూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు మేఘన(12). మరో బాలిక దేవిశ్రీ పరిస్థితి తీవ్రంగా ఉంది.

వీరిద్దరు రాత్రి చీరతో ఊయల వేసుకుని ఊగుతుండగా ఊయల గిరగిరా తిరుగుతూ ఇద్దరి మెడలకు బిగుసుకుంది. ఈ సంఘటనలో మేఘనా మరణించగా, దేవిశ్రీ అనే బాలిక చావుబతుకుల్లో ఉంది. ఆమెను బెంగుళూరులోని ఆస్పత్రికి తరలించారు. నంగలి పోలీసులు కేసు  నమోదు చేసుకున్నారు.

చదవండి: నకిలీ డాక్టర్ల దోపిడీ గుట్టు రట్టు..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top