ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్‌ దక్కడేమోనని.. | Girl Committed Suicide With Triangle Love in Kamareddy | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్‌ దక్కడేమోనని..

Feb 1 2022 7:42 PM | Updated on Feb 1 2022 7:46 PM

Girl Committed Suicide With Triangle Love in Kamareddy - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, కామారెడ్డి: ప్రేమికుడు తనకు దక్కడేమోనని భయంతో ఓ మైనర్‌ బాలికి ఇంట్లో ఉరేసుకున్ని ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌ నగర్‌ కాలనీకి చెందని భరత్‌కు, ముశ్రీఫ్‌ బాగ్‌ కాలనీకి చెందిన మైనర్‌ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇరు కుటుంబాలకు విషయం తెలిసి.. వారికి వయసు లేదని, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని అప్పటివరకు దూరంగా ఉండాలని పెద్దలు నచ్చజెప్పారు.

ఇదిలా ఉండగా శాంతిప్రియ అనే అమ్మాయి సోమవారం రోజున భరత్‌ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని, అతని దూరంగా ఉండాలని మైనర్‌ అమ్మాయికి వాట్సప్‌ ద్వారా బెదిరించింది. ఈ నేపథ్యంలోనే శాంతిప్రియ, భరత్‌ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా మైనర్‌కు పంపింది. దీంతో భరత్‌ తనకు దక్కడేమోనని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్‌ ఆత్మహత్య చేసుకుంది. తమ అమ్మాయి చావుకు భరత్‌, శాంతి​ ప్రియలే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చదవండి: (ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే) 

Advertisement
 
Advertisement
Advertisement