చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్‌ బాలికపై అత్యాచారం

Fun Bucket Bhargav Has Arrested In Molestation Case: Anchor Shiva - Sakshi

గర్భం దాల్చిన మైనర్‌ బాలిక

భార్గవ్‌ను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించిన పోలీసులు

టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 14 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో మైనర్‌ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్‌ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.


ఈ పరిచయంతో మైనర్‌ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్‌ చేయడం, కలుసుకుంటుం‍డంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో భార్గవ్‌ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సం‍ప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. ​ విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్‌ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్‌ శివ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించాడు.

ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా 2 లక్షలు ఇస్తాం..కేసు వాపసు తీసుకోండి అని భార్గవ్‌ పోలీసులను ప్రాధేయపడినట్లు శివ తన స్టోరీలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భార్గవ్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్‌ చేశారని వివరించాడు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ వార్త నిజమేనా? లేక యాంకర్‌ శివ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. 

దీంతో ఇది వ్యూస్‌ కోసం చేయడం లేదని, ఈ వార్తను బయటకు రానివ్వకుండా ఎక్కడ ఆపేస్తారో అని తాను పోస్ట్‌ చేస్తున్నట్లు యాంకర్‌ శివ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది ప్రాంక్‌ కాదని, నిజమైన వార్తేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్‌ శివ చేసిన వరుస పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్‌ రచ్చరచ్చ
హీరోయిన్‌ అంజలా జవేరీ భర్త 'విలన్'‌ అని మీకు తెలుసా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top