అందుకే పిల్లలు వద్దనుకున్నాం: అంజలా జవేరీ భర్త

Heroine Anjala Zaveri Birthday Special - Sakshi

తొలి సినిమాతోనే బంపర్‌ హిట్‌ అందుకున్న హీరోయిన్లలో అంజలా జవేరీ ఒకరు. వెంకటేష్‌ సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం​ ప్రేమించుకుందాం రా. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడంతో అంజలా జవేరీకి వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో రెండో సినిమాతోనే అంజలాకు మెగాస్టార్‌ చిరంజీవితో జతకట్టే అవకాశం దక్కింది. 1998లో చిరంజీవి-జవేరీ నటించిన చూడాలని ఉంది సినిమా బంపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. మంగళవారం అంజలా జవేరీ బర్త్‌డే సందర్భంగా ఆమెకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ విశేషాలు మీకోసం. 

బాలకృష్ణతో సమరసింహా రెడ్డి, నాగార్జున రావోయి చందమామ వంటి సినిమాలు విజయవంతం కావడంతో తెలుగులో కాన్నాళ్ల పాటు అంజలా జవేరీ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ఆ సమయంలోనే మోడల్‌ తరుణ్‌ అరోరాతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు డేటింగ్‌ అనంతరం ఈ జంట పెళ్లి పీటలెక్కింది. అయితే  భవిష్యత్‌లోనూ పిల్లల్ని కనే ఉద్దేశం లేదని, తాము పిల్లలు వద్దునుకున్నాం అని తరుణ్‌ అరోరా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

దీనికి ఉన్న కారణం చెబుతూ.. పెద్ద‌లు కుదిర్చిన బంధంలో పెళ్లి త‌ర్వాత భార్యాభ‌ర్త‌ల ప్రేమకు గుర్తుగా పుట్టేందుకు పిల్లలు పుడతారని, అయితే తాము మాత్రం ముందు నుంచే ప్రేమలో ఉన్నామన్నారు. తన దృష్టిలో జవేరీ ఒక పాపాయి వంటిదని ఇక పిల్లలు లేరనే బాధ, కావాలనే కోరిక తమకు లేవని చెప్పుకొచ్చారు.


తరుణ్‌ అరోరా కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. టాలీవుడ్‌లో ఆయనకు మోస్ట్ స్టైలిష్‌ విలన్‌ అనే పేరు ఉంది. ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో విలన్‌ పాత్ర గుర్తుంది కదా..అందులో నటించింది ఈయనే. కాటమ రాయుడు , జయ జానకి నాయక అర్జున్ సురవరం వంటి సినిమాల్లోనూ విలన్‌ పాత్రలో నటించిన తరుణ్‌ అరోరా అంజలా జవేరీ భర్త అని చాలా మందికి తెలియదు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన అంజలా జవేరీ.. 2012లో చివరగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో నటించింది. 

అంజలా జవేరీ అరుదైన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

చదవండి : 
ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య

రచ్చకెక్కిన అజయ్‌- రవీనా లవ్‌స్టోరీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top