చిన్నారి ఏడుస్తున్నా కనికరించని దుర్మార్గుడు 

 Five Year Old Molested And Critically Injured In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ సిటీ: స్థానిక ముత్తా నగర్‌లో గత నెల 24వ తేదీ రాత్రి ఐదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన తాడి ప్రభు అలియాస్‌ చిన్న అనే 29 ఏళ్ల వ్యక్తిని కత్తిపూడి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తాడి ప్రభు నవంబర్‌ 24న స్నేహితుడితో కలసి మద్యం తాగాడు. మత్తులో జోగుతున్న స్నేహితుడి వద్ద సెల్‌ఫోన్, డబ్బులు దొంగిలించాడు. అక్కడ నుంచి వెళ్లిపోతూ బాలిక తాత సెల్‌ ఫోన్‌ దొంగిలించాలని ఇంట్లోకి వెళ్లాడు.

ఆ సమయంలో నేలపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఎత్తుకుని దగ్గర్లోని శ్మశాన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఏడుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాలికను కొద్ది దూరం తీసుకొచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం కాకినాడ జ్యోతుల మార్కెట్‌ సమీపంలోని ఒక లాడ్జిలో రూమ్‌ తీసుకుని రెండు రోజులు ఉన్నాడు. రూము తాళం కూడా ఇవ్వకుండా అమలాపురం, అటు నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం రౌతులపూడిలో స్నేహితుడి ఇంటికి వచ్చాడు. అక్కడ నుంచి వస్తూ కత్తిపూడిలో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నేరం చేసినట్టు అంగీకరించాడు.  చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు)

సెల్‌ఫోన్లు స్వాధీనం: నిందితుడు ప్రభు నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ. 7 వేలు, బస్‌ టికెట్, లాడ్జి రూమ్‌ తాళం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మి తెలిపారు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్థలంలో బాలిక గౌను, కట్‌ డ్రాయర్, నిందితుడి దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తునకు 13 ప్రత్యేక బృందాలను ఉపయోగించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఏఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ వి.భీమారావు, దిశ డీఎస్పీ ఎస్‌.మురళీమోహన్, డీఎస్పీ అంబికా ప్రసాద్, వన్‌టౌన్‌ సీఐ టి.రామమోహన్‌రెడ్డి, పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.  చదవండి:  (తాగిన మైకంలో కూతురి హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top