సహచరులను కాల్చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాను | Five BSF Soldiers Killed By Colleague In Punjab | Sakshi
Sakshi News home page

సహచరులను కాల్చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాను

Mar 6 2022 1:53 PM | Updated on Mar 7 2022 4:32 AM

Five BSF Soldiers Killed By Colleague In Punjab - Sakshi

అమృతసర్‌: బీఎస్‌ఎఫ్‌ జవాను ఒకరు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో తోటి జవాన్లు నలుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సదరు జవాను కూడా మృతి చెందాడు. పంజాబ్‌లో ఖాసా ఏరియాలోని 144వ బెటాలియన్‌ క్యాంపులో ఆదివారం ఈ ఘోరం జరిగింది. కర్ణాటకకు చెందిన సత్తెప్ప అనే జవాను తనకు బాగాలేదని చెప్పడంతో శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చినట్టు బీఎస్‌ఎఫ్‌ పంజాబ్‌ ఐజీ ఆసిఫ్‌ జలాల్‌ చెప్పారు.

ఆదివారం ఉదయమే అతను డిశ్చార్జై క్యాంపులోకి వచ్చాడని, ఆయుధాగారం నుంచి తుపాకీ తీసుకొనికాల్పులకు దిగాడని చెప్పారు. కాల్పుల్లో హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ ర్యాంకు జవాన్లు నలుగురు చనిపోయారన్నారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉందనిత చెప్పారు. తర్వాత సత్తెప్ప కూడా చనిపోయి కన్పించాడు. ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. మృతులను రామ్‌ వినోద్‌ (బిహార్‌), తొరాస్కర్‌ (మహారాష్ట్ర), రతన్‌ సింగ్‌ (జమ్మూకశ్మీర్‌), బల్జీందర్‌ కుమార్‌ (హరియాణా)గా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement