కన్నతండ్రి కిరాతకం | The Father Who Murdered The Son Put His Betting Matters | Sakshi
Sakshi News home page

కన్నతండ్రి కిరాతకం

Jun 29 2022 8:54 AM | Updated on Jun 29 2022 8:54 AM

The Father Who Murdered The Son Put His Betting Matters - Sakshi

కోలారు: జూదాలు, క్షణికావేశాలు అనుబంధాలను ఛిద్రం చేస్తున్నాయి. బెట్టింగ్‌ విషయాలు ఎక్కడ బయట పెడతాడేమోనని ఏకంగా కన్న కుమారుడినే తండ్రి  కిరాతకంగా హత్య చేసిన ఘటన కోలారు తాలూకా శెట్టి మాదమంగల గ్రామంలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకా మదరకల్లుకి చెందిన నిఖిల్‌కుమార్‌ (12) హత్యకు గురయ్యాడు. వివరాలు...నిఖిల్‌ కుమార్‌ తండ్రి మణికంఠప్ప  ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. విషయం అంతా కుమారుడికి తెలుసు.

ఎక్కడ బయటకు చెబుతాడేమోనని కుమారున్ని గొంతు నులిమి కోలారు తాలూకా శెట్టి మాదమంగల గ్రామ సమీపంలో చెరువులో పడేసి వెళ్లాడు. ఏమీ తెలియనట్లు చింతామణి పీఎస్‌లో కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మంగళవారం చెరువులో బాలుడి మృతదేహం పడిఉన్నట్లు తెలిసి   కోలారు రూరల్‌ పోలీసులు,  చింతామణి పోలీసులకు తెలిపారు. విచారణలో కన్న తండ్రే హంతకుడని తెలుసుకున్న పోలీసులు మణికంఠప్పను అరెస్టు చేశారు.  

(చదవండి: డ్రగ్స్, మద్యం వల్ల అధిక ఆత్మహత్యలు.. ఆ రాష్ట్రాలే టాప్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement