
అంజప్ప, విష్ణుప్రసాద్(ఫైల్ ఫొటోలు)
అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రీ కొడుకులు హతం
చింతామణి/కర్ణాటక: ఇంటి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల్లో తండ్రీ కొడుకు హత్యకు గురయ్యారు. ఈ ఘటన పట్టణలోని శ్రీరామనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శ్రీరామనగర్‌కు చెందిన అంజప్ప, అశ్వత్థనారాయణ అన్నదమ్ములు. ఇంటి పంపకాల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది. తరచూ అన్నదమ్ములు గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి కూడా గొడవ పడ్డారు.
తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగడంతో అంజప్ప, అతని కుమారుడు విష్ణుప్రసాద్‌పై అశ్వర్థనారాయణ, అతని కుటుంబ సభ్యులు వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో అంజప్ప కూడా ఎదురుదాడికి దిగి అశ్వత్థనారాయణపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన అంజప్ప(45)ను కోలారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. విష్ణుప్రసాద్(17) చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అశ్వత్థనారాయణ చిక్కబళ్లాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: మామతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డుతొలగించి..
కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్