భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..

Father Murdered His 7 Year Old Boy Because His Third Wife Hated Him - Sakshi

ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్‌ గటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్‌ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్‌ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది.

దీంతో విసిపోయిన శశిపాల్‌ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్‌ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్‌ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్‌ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్‌ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్‌ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు.

ఐతే ఆమె అతడి వాట్సాప్‌ నెంబర్‌ని బ్లాక్‌ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్‌ని అతని మూడో భార్య పాయల్‌ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్‌ మొబైల్‌లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్‌ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల​ తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్‌ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

(చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top