బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి | Fake Priests Molestation Women In Yadadri District | Sakshi
Sakshi News home page

బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి

May 31 2021 11:38 AM | Updated on May 31 2021 11:44 AM

Fake Priests Molestation Women In Yadadri District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రామన్నపేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

సాక్షి, యాదాద్రి: రామన్నపేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడిని వీడియో తీసిన బురిడీ బాబాల అనుచరులు.. బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు సెటిల్‌మెంట్‌ చేశారు.

దీంతో బాధిత మహిళ రాచకొండ సీపీని ఆశ్రయించింది. విచారణలో పోలీసులు, బాబాల బాగోతం వెలుగు చూసింది. నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సీఐ, ఎస్‌ఐను సీపీ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement