ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో..

Youngster Deceased In Nalgonda Over His Lover Marriage Fixed - Sakshi

గుర్రంపోడు: ‘నువ్వే నా ప్రాణమని చెప్పా.. ఇక బతికినా నీతోటే... చచ్చినా నీతోటే అని చెప్పినా నువ్వు పట్టించుకోలేదు.. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. అందుకే చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. ఇదే నా ఆఖరి కోరిక’ అంటూ ఓ యువకుడు ప్రియురాలిని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా గుర్రంపోడుకి చెందిన మైదాసు రమేశ్, యాకాశమ్మ దంపతుల కుమారుడు రాకేశ్‌ నల్లగొండలో డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. రాకేశ్‌ అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంతకాలంగా ఇష్టపడుతున్నాడు.

అయితే, తాను ప్రేమించిన యువతికి మరొకరితో జూన్‌ 2న వివాహం నిశ్చయించారని తెలుసుకున్న రాకేశ్‌ మనస్తాపానికి గురయ్యాడు.  శనివారం సాయంత్రం తాను చని పోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితుల వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసి ఉరేసుకున్నాడు. వేరే ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం  ఇచ్చారు. వెంటనే వారు ఇంటికి వచ్చి..  ప్రాణాపాయస్థితిలో ఉన్న రాకేశ్‌ను  నల్లగొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు.
చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top