మరో మహిళతో దొరికిన భర్త.. కట్టేసి కొట్టిన భార్య | Extramarital Affair: Wife Caught Husband Red Handed At Khammam | Sakshi
Sakshi News home page

మరో మహిళతో దొరికిన భర్త.. కట్టేసి కొట్టిన భార్య

Jan 4 2021 11:30 AM | Updated on Jan 4 2021 12:21 PM

Extramarital Affair: Wife Caught Husband Red Handed At Khammam - Sakshi

సోమవారం తెల్లవారుజామున గట్టయ్య సెంటర్‌కు భర్త వెళ్లడం చూసిన భార్య, బంధువులు కొద్దిసేపటి తర్వాత వెళ్లి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్యను మోసం చేసిన భర్తకు తగిన శాస్తి జరిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను, సదరు భార్య​, ఆమె తరపు బంధువులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్‌లో చోటు చేసుకుంది. ఖమ్మం నగర్‌కు చెందిన శీను ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కోర్ట్ కాలనీ కి చెందిన కవితతో  20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా తరచూ భార్య, పిల్లలతో గొడవ పడుతున్నాడు. ఇదే క్రమంలో గట్టయ్య సెంటర్‌లో భార్యకు తెలియకుండా ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. 

అదే ఇంట్లో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో  కలిసి ఉంటున్నాడు. రోజూ ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పడం అక్కడ నుంచి నేరుగా ఆ మహిళ వద్దకు వెళ్లడం చేస్తున్నాడు. దీంతో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య బంధువులతో కలిసి నిఘా పెట్టింది. సోమవారం తెల్లవారుజామున గట్టయ్య సెంటర్‌కు భర్త వెళ్లడం చూసిన భార్య, బంధువులు కొద్దిసేపటి తర్వాత వెళ్లి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. భర్తతో పాటు మహిళకు దేహశుద్ది చేశారు. చేతులు కట్టేసి చితకబాదారు. అనంతరం భర్తను, ఆ మహిళను  ఖమ్మం టూటౌన్ పోలిసులకు అప్పగించారు.
(చదవండి: పనిమనిషిపై మోజు... కటకటాలపాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement