భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్‌ | Extra Marital Affair: Husband Brutally Murder Her Wife And Lover Case In Karnataka | Sakshi
Sakshi News home page

నా భార్యను అలా చూసి తట్టుకోలేకపోయా.. అందుకే ఆ పనిచేశా!

Dec 17 2021 7:47 AM | Updated on Dec 17 2021 7:52 AM

Extra Marital Affair: Husband Brutally Murder Her Wife And Lover Case In Karnataka - Sakshi

నిందితుడు ముత్తురాజు

సాక్షి, బొమ్మనహళ్లి (కర్ణాటక): బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలో కలకలం సృష్టించిన డబుల్‌ మర్డర్‌లో మిస్టరీ వీడింది.  చందాపుర వద్ద భార్యను, ఆమె ప్రియున్ని నరికి చంపిన ఘటనలో భర్తను సూర్య నగర పోలీసులు అరెస్టు చేశారు.


గత శనివారం భార్య కావ్య, మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు నారాయణస్వామి ఇంట్లో ఒకే గదిలో ఉండగా, కావ్య భర్త చిక్కహాగడె ముత్తురాజు కొడవలితో హతమార్చి పరారయ్యాడు. ఈ డబుల్‌ మర్డల్‌ తీవ్ర కలకలం రేకెత్తించింది. పోలీసులు గాలించి గురువారం అరెస్టు చేశారు.

వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నందునే  హత్య చేసినట్లు పోలీసుల ముందు చెప్పాడు. హతుడు నారాయణస్వామి గ్రామ పంచాయతీ సభ్యుడుగా ఉన్నాడని, అతనిపైన గతంలో క్రిమినల్‌ కేసు ఉందని, ఆనేకల్‌ పరిధిలో రౌడీషీట్‌ కూడా ఉందని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్,.పి. కే. వంశీకృష్ణ తెలిపారు.    

చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి

Advertisement
 
Advertisement
Advertisement