అరకు నుంచి గంజాయి తరలిస్తూ బస్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి..  | Engineering Student Dies In Road Accident In Pendurthi | Sakshi
Sakshi News home page

Visakhapatnam: అరకు నుంచి గంజాయి తరలిస్తూ బస్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి..

Dec 17 2021 10:27 AM | Updated on Dec 17 2021 11:23 AM

Engineering Student Dies In Road Accident In Pendurthi - Sakshi

పెందుర్తి: నాయుడుతోట సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం వద్ద బీఆర్‌టీఎస్‌ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన గోపీ మనోజ్‌ (23), అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌కు చెందిన శేఖరమహంతి వరుణ్‌ కలిసి అరకు నుంచి నగరానికి స్కూటీపై వెళుతున్నారు. ఆర్‌ఆర్‌ వెంకటాపురం వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో స్కూటీ అదుపు తప్పింది. దీంతో రోడ్డుపై తుళ్లిపడిన మనోజ్‌ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న వరుణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరు ప్రయాణించిన స్కూటీని పరిశీలించగా అందులో రెండున్నర కిలోల గంజాయి(రెండు ప్యాకెట్లు) కనిపించింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న క్రమంలో వీరు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన మనోజ్‌ నగరంలోని ఓ ప్రయివేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గాయపడ్డ వరుణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌ఐ బి.గణేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: Guntur: ఫోన్‌ మాట్లాడుతుండగా బస్సు ఢీకొని యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement