సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు.. | Engineering Student Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు..

Jul 30 2020 8:19 AM | Updated on Jul 30 2020 8:19 AM

Engineering Student Commits Suicide in Hyderabad - Sakshi

ఉప్పల్‌: సెల్‌ఫోన్‌లో ఆటలేంటని బాబాయి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ ఫైనల్‌ యియర్‌ చదుతున్న ఆశుతోష్‌ కుమార్‌(23) పది నెలల క్రితం ప్రాజెక్టు పనిపై ఉప్పల్‌ శ్రీనివాస్‌ హైట్స్‌లో ఉంటున్న తన బాబాయి సంతోష్‌ కుమార్‌ ఇంటికి వచ్చాడు.

కాగా బుధవారం ఉదయం నుంచి అతను సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతడి బాబాయి సంతోష్‌ కుమార్‌ స్నానం చేసి భోజనం చేయాలని పలు మార్లు చెప్పినా వినిపించుకోలేదు. పదే పదే చెప్పడంతో మనస్తాపానికిలోనైన ఆశుతోష్‌ భవనం 6వ అంతస్తుకు అక్కడి నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని ప్రైవేట్‌ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement