దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు..

Elderly Man Brutally Assassinated In Srikakulam District - Sakshi

మనవళ్లే ప్రధాన నిందితులు

మందస మండలంలో ఘటన

నాటుతుపాకీతో కాల్చి చంపిన వైనం  

మందస(శ్రీకాకుళం జిల్లా): మనవళ్లు తనవాళ్లు కాలేకపోయారు. ఆస్తిపై ప్రేమ పెంచుకున్న వారు తాతయ్యపై అభిమానం చూపలేకపోయారు. కష్టం వస్తే కాచుకోవాల్సిన వారే కాటికి దారి చూపారు. కదల్లేని వయసు లో ఉన్న తాతను నాటు తుపాకీతో కాల్చి చంపేశారు. మందస మండలం చికిడిగాం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పారిగ కమలొ(85) అనే వృద్ధుడు చికిడిగాంలో నివాసముంటున్నారు.

ఆయనకు ముగ్గురు కుమార్తె లు రొంబ, జయంతి, సుకుంతల, ఒక కుమారుడు రమ్మో ఉన్నారు. రమ్మోకు ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య జమ్మకు ముగ్గురు కొడుకులు బుడ్డు, లక్ష్మణ్, దేవరాజులు ఉన్నారు. రెండో భార్య మాధవికి మనోజ్‌ అనే కుమారుడు ఉన్నారు. మనోజ్‌ ప్ర స్తుతం అసోంలో ఉంటున్నాడు. కమలొకు ఏడెకరాల భూమి ఉంది. ఈ ఆస్తి విషయంలో రమ్మో తన తండ్రితో ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. మనవళ్లు కూడా తాతతో నిత్యం తగాదా పడుతుండేవారు. దీ నిపై కోర్టుకు కూడా వెళ్లారు. కేసును కమలొ గెలిచా రు. అయితే ఆస్తి గొడవల కారణంగా కమలొ ఊరి లోనే ఉన్న చిన్నకుమార్తె సుకుంతల ఇంటిలో ఉంటున్నారు.

ఆదివారం అర్ధరాత్రి ఇంటి నుంచి తుపాకీ పేలి న శబ్ధం రావడంతో బయట నిద్రిస్తున్న సుకుంతల కూతురు సీత లోపలకు వెళ్లి చూసింది. కమలొ రక్తపు మడుగులో గిలగిలలాడుతూ కనిపించడం, ఆయన ఛాతీపై బుల్లెట్‌ గాయం ఉండడంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికే కమలొ మృతి చెందారు. తాను ఇంటిలోపలకు వెళ్లేటప్పటికి అక్కడ బుడ్డు, లక్ష్మణతో పాటు రాయగడ బ్లాక్, గారబంద పంచాయతీ లోవ గ్రామానికి చెందిన సవర బుడ్డు(24) పారిపోతూ తనకు కనిపించారని సీత పోలీసులకు తెలిపారు. ఆస్తిని కుమార్తెలకు ఇచ్చేస్తాడన్న అనుమానంతోనే మనవళ్లు నాటు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాస్త ఆలస్యంగా.. 
చికిడిగాంలో హత్య జరిగిందన్న సమాచారంతో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, మందస ఎస్‌ఐ బి.రామారావులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ వచ్చాయి. డాగ్‌ స్క్వాడ్‌ నిందితులు తిరిగిన ప్రాంతాల్లోనే తిరగడంతో పోలీ సుల అనుమానం బలపడింది. క్లూస్, క్రైమ్‌ టీమ్‌లు ఘటనా స్థలంలో బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నా యి. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించాయి.

అయితే ఘటన ఆదివారం రాత్రి జరిగినా పోలీసులు అక్కడకు వెళ్లేందుకు కాస్త సమయం పట్టింది. చికిడిగాం కాస్త అడవుల్లో ఉండడం, మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్లడానికి వెనుకడుగు వేశారు. భారీ బందోబస్తు మధ్య సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు వెళ్లి దర్యాప్తు చేశారు. సోంపేట సీఐ సతీష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి చెప్పారు.

చదవండి: ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!
అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top