
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు ఈడీ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. తదపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
నిందితుడు విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100కోట్ల అడ్వాన్స్ చెల్లించినట్లు పేర్కొంది. పాలసీ తయారీలో వినయ్ నాయరే కీలక పాత్ర పోషించాడని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి, ఆప్ సమాచార పర్యవేక్షకుడు విజయ్‌నాయర్‌లు కలిసి లంచాలు ఇచ్చినట్లు చెప్పింది. హోల్‌సెలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు అందజేసినట్లు రిపోర్టులో ప్రస్తావించింది.
ప్రభుత్వంలోని పెద్దలకు రూ.30కోట్ల వరకు చెల్లించారని, విజయ్ నాయర్ తనకు తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీని తమవారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని, పాలసీ తయారీకి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం