మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా? | Sakshi
Sakshi News home page

మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా?

Published Thu, Mar 7 2024 9:20 PM

Delhi Gym Trainer Stabbed 15 Times Killed Hours Before Wedding Cops Suspect Father - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం జరిగింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి ఉంది అనగా.. వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతకంగా 15సార్లు పొడిచి మరి ప్రాణాలు తీశారు అగంతకులు. ఈ ఘటన సౌత్‌ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు..

29 ఏళ్ల గౌరవ్‌ సింఘాల్‌ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఇతడికి గురువారమే పెళ్లి జరగనుంది.  ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మరికొన్ని గంటల్లో వధువు మెడలో తాళి కడతాడనే సమయంలో తన ఇంట్లోనే తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. అతని ముఖం, ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచిన గుర్తులు ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే సింఘాల్‌ హత్య విషయంలో తమ కుటుంబంలో ఎవరిని అనుమానించడం లేదని మృతుడి మేనమామ జావవర్‌ తెలిపారు. అతడ్ని ఎవరూ చంపారే విషయంలో కుటుంబానికి తెలియదని, ఇంటి దగ్గర బ్యాండ్‌ సౌండ్‌ వస్తుండటంతో తమకు ఎలాంటి అరుపులు వినపడలేదని తెలిపారు. హత్యపై పోలీసులు సరైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరారు. 

మరోవైపు మృతుడికి, అతడి తండ్రితో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ కేసుపై అయిదు బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందిడిని అదుపులోకి తీసుకొని, హత్యకు దారితీసిన కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement