భర్త మృతిపై అనుమానం: నెల తరువాత మృతదేహం..  | Deceased Body Extraction From Graveyard In Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్త మృతిపై అనుమానం: నెల తరువాత మృతదేహం.. 

Apr 24 2021 8:38 AM | Updated on Apr 24 2021 8:38 AM

Deceased Body Extraction From Graveyard In Tamil Nadu - Sakshi

మృతదేహాన్నీ వెలికి తీస్తున్న పోలీసులు

తిరువళ్లూరు: భర్త మృతిపై అనుమానం వుందని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు  శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్ట మ్‌ నిర్వహించిన సంఘటన కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా రామతండలం గ్రామానికి చెందిన సుధ(23)కు పెరంబదూరు  గత మార్చి 29న  రాజశేఖర్‌  అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు నిర్ధారించడంతో పోస్టుమార్టమ్‌ నిర్వహించకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భర్త మృతిపై అనుమానంతో  సుధ, తిరువళ్లూరు  కలెక్టర్‌ పొన్నయ్య, ఎస్పీ అరవిందన్‌కు ఫిర్యాదు చేసింది.శుక్రవారం పోలీసుల సమక్షంలో శవపరిక్ష నిర్వహించారు.

పుస్తకం తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థినిపై లైంగిక దాడి
తిరువొత్తియూరు: బ్రిడ్జ్‌ కోర్సు పుస్తకాన్ని తీసుకోవడానికి పాఠశాలకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా పెన్నాగరానికి చెందిన విద్యార్థిని (14) సమీప గ్రామంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల కోసం బ్రిడ్జ్‌ కోర్సు పుస్తకాన్ని అందజేస్తున్నారు.

ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి విద్యార్థిని గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లియంపట్టికి చెందిన గోవిందన్‌ (43) విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. విద్యార్థిని దీని గురించి తల్లిదండ్రులతో చెప్పడంతో పెన్నాగరం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు  చేసి ఉపాధ్యాయుడు గోవిందన్‌ను పోక్సో చట్టం కింద శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 
చదవండి: బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి
చదవండి: ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తయారు చేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement