కూతురు ప్రేమ వివాహం.. తండ్రి  ఆత్మహత్య  | Daughter Love Affair: Father Commits Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

కూతురు ప్రేమ వివాహం.. తండ్రి  ఆత్మహత్య 

Jan 11 2022 8:11 AM | Updated on Jan 11 2022 8:11 AM

Daughter Love Affair: Father Commits Suicide In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దుండిగల్‌(హైదరాబాద్‌): కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ రాజీవ్‌గృహకల్పకు చెందిన మిరాజ్‌(40)కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ఇతడి పెద్ద కుమార్తె జవేరియా తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని వేరే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.

దీంతో తాగుడుకు బానిసైన మిరాజ్‌ మనస్తాపానికి గురవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ రాత్రి మిరాజ్‌ ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు జావేద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: ‘భార్యలను మార్చుకునే’ రాకెట్‌ గుట్టురట్టు!

Advertisement
 
Advertisement
Advertisement