సైబర్‌ అలర్ట్‌: 2020లో భారీగా పెరిగిన సైబర్ మోసాల సంఖ్య

Cyber Crimes - Sakshi

కస్టమర్‌ కేర్, ఉద్యోగం, రుణాలు, వ్యాపారం, ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల విక్రయాలు, గిఫ్టులు, ఫేస్‌బుక్‌.. ఇలా పలు విధాలుగా ఆన్‌లైన్‌లో ఎరవేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ కేటుగాళ్లు. ఒక్కో పీఎస్‌లో రోజుకో ఒక సైబర్ కేసు అన్న నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. 2020లో 50,035 సైబర్ నేరాల కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌‌బీ) 2020 నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 శాతం అధికమని ఎన్‌సీఆర్‌‌బీ నివేదికలో తేలింది. 

2020లో నమోదైన మొత్తం సైబర్ నేరాల సంఖ్యలో 30,142 లేదా 60 శాతం సైబర్ మోసాలకు చెందడం ఆందోళన కలిగిస్తుంది. దీని తర్వాత 3,293 (సుమారు 7 శాతం) లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత దోపిడీ(2,440 కేసులు), అపఖ్యాతి(1,706 కేసులు), వ్యక్తిగత ప్రతీకారం(1,470) కేసులు నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌‌బీ నివేదికలో తేలింది. ఈ ఐదు విభాగాల కేసులు 2020లో నమోదైన మొత్తం సైబర్ క్రైమ్ కేసులలో 78 శాతం. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో సైబర్ క్రైమ్(9,680) కేసులు నమోదైతే అందులో మోసానికి పాల్పడిన కేసులే ఎక్కువ ఉన్నాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్‌న్యూస్‌..!)

3వ స్థానంలో తెలంగాణ
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(4,674), తెలంగాణ (4436) రాష్ట్రాలలో ఎక్కువగా సైబర్ మోసాలకు చెందిన కేసులు వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మోసానికి సంబంధించిన కేసులే 60శాతం ఉన్నాయి. ఇక సైబర్ లైంగిక దాడుల కేసులు మహారాష్ట్రలో(612) అత్యధికంగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(560), అస్సాం (483) ఉన్నాయి. సైబర్ నేరాల కేసులలో సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన 3,112 ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులకు అందినట్లు హిందుస్థాన్ టైమ్స్ సెప్టెంబర్ 19న నివేదించింది. బాధితుల ఖాతాల నుంచి దాదాపు 19 కోట్ల రూపాయలు దొంగలించారు. ఈ మొత్తంలో సుమారు 10 శాతం తిరిగి ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. అందుకే,  ఆన్‌లైన్‌ వినియోగిస్తున్నప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top