ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్‌న్యూస్‌..! | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్‌న్యూస్‌..!

Published Tue, Sep 21 2021 5:55 PM

Hyundai, Kia To Launch 6 Electric Cars By 2024 - Sakshi

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఇటీవలి కాలంలో మద్దతు ప్రజల బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే వాహన తయారీ కంపెనీలు కూడా విద్యుత్‌ వాహనాలకు(ఈవీలు) సంబందించి తమదైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే, వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్‌ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో వారానికి ఒక వాహనం బయటికి విడుదల అవుతుంది. తాజాగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి రాబోయే మూడు ఏళ్లలో భారతదేశంలో హ్యుందాయ్, కియా రెండూ ఒక్కొక్కటి మూడు ఈవీలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.

వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి హ్యుందాయ్ అయోనిక్ 5, కియా ఈవి6 కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ 18 నిమిషాలలోపు 80 శాతం ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అయోనిక్ 5లో కొన్ని వేరియెంట్లలో బ్యాటరీ చార్జ్ కోసం కారు పైకప్పుపై సోలార్ ప్యానెల్ తో కూడా రావచ్చు. ఒక నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ కోనా ఈవిలో మరో మోడల్ ను ఈ సంవత్సరం చివర్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు, కియా ఈ-నీరో రెండు కార్లు 39.2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 136 హెచ్‌పీ మోటార్ లేదా 64కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 204 హెచ్‌పీ మోటార్ తో వస్తాయని సమాచారం. ఈ-నీరో వరుసగా 289 కిలోమీటర్లు, 455 కిలోమీటర్ల పరిధితో వస్తే, కోనా 305 కిలోమీటర్లు, 484 కి.మీ పరిధితో వచ్చే అవకాశం ఉంది.(చదవండి: ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్‌..!)

Advertisement
Advertisement