నిర్వీర్యం చేస్తుండగా పేలిన మందుపాతర | CRPF Deputy Commandant Deceased In IED Blast Chhattisgarh | Sakshi
Sakshi News home page

నిర్వీర్యం చేస్తుండగా పేలిన మందుపాతర

Dec 15 2020 10:18 AM | Updated on Dec 15 2020 10:18 AM

CRPF Deputy Commandant Deceased In IED Blast Chhattisgarh - Sakshi

డిప్యూటీ కమాండెంట్‌ వికాస్‌కుమార్

సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండెంట్‌ మృతి చెందాడు. సుకుమా జిల్లా పాలోడి క్యాంపునకు సమీపంలో గల కాసారం మార్గంలో పోలీసు బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు గతంలో మందుపాతర ఏర్పాటు చేశారు. పోలీసులు ఆదివారం దానిని గుర్తించి.. నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో పేలింది. పాలోడి క్యాంపునకు చెందిన 208 కోబ్రా విభాగం డిప్యూటీ కమాండెంట్‌ వికాస్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.


చదవండి: మం‍త్రి పువ్వాడ అజయ్‌కు కరోనా..
చదవండి: పోలీస్‌ ఇన్ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement