తల్లీ, కుమార్తెల ఘరానా మోసం.. పిల్లల్ని సాకుతామని తీసుకెళ్లి.. | Childrens Missing Mistery In Karnataka | Sakshi
Sakshi News home page

తల్లీ, కుమార్తెల ఘరానా మోసం.. పిల్లల్ని సాకుతామని తీసుకెళ్లి..

Aug 5 2021 8:27 PM | Updated on Aug 5 2021 8:27 PM

Childrens Missing Mistery In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు (కర్ణాటక): మైసూరుతో పాటు జిల్లాలో చిన్నపిల్లలను పోషిస్తామని తీసుకెళ్లి విక్రయిస్తున్న వ్యవహారంలో తల్లీ కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నంజనగూడుకు చెందిన శ్రీమతి అలియాస్‌ సరస్వతి, ఆమె కుమార్తె లక్ష్మి. నెలరోజుల కిందట జ్యోతి అనే పేద మహిళకు మైసూరులో మగబిడ్డ పుట్టగా, ఆమె వెంట ఉన్న శ్రీమతి బిడ్డను తాను సాకుతానని ఇంటికి తెచ్చుకుంది. కొన్నిరోజుల తరువాత ఆ బిడ్డను ఇతరులకు డబ్బులకు అమ్ముకుంది.

నా బిడ్డ నాకు కావాలని జ్యోతి వచ్చి అడగడంతో వేరేవారికి ఇచ్చేశానని శ్రీమతి చెప్పింది. నా బిడ్డను ఇప్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది, శ్రీమతి, ఆమె కుమార్తె కలిసి జిల్లాలో పలువురి బిడ్డలను ఇలా అమ్ముకున్నారని తెలిసి పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో శిశువును రూ.3 – 5 లక్షల వరకు అమ్మేసినట్లు వారు ఒప్పుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement