లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి.. | Chennai Police Busted Prostitution Racket In Tiruvottiyur | Sakshi
Sakshi News home page

లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి..

Nov 19 2022 11:44 AM | Updated on Nov 19 2022 12:01 PM

Chennai Police Busted Prostitution Racket In Tiruvottiyur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై సాలిగ్రామంలో లాడ్జిలో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఆర్కాడు రోడ్డులోని ఓ లాడ్జిలో యువతులను పిలిపించి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  పోలీసులకు రహస్య సమాచారం అందింది.

ఈ మేరకు పోలీసుల ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి నేతృత్వంలో పోలీసులు గురువారం రాత్రి సంబంధిత లాడ్జిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ రెండో అంతస్తుల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకుని యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడున్న బ్రోకర్లు రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన కర్ణన్‌ (36), తిరువన్నామలైకు చెందిన మనికంఠన్‌ (30), విల్లుపురం పట్టణానికి చెందిన శివప్రసాద్‌(24)ను అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసులు విచారణ జరపగా వారు వ్యభిచార నిర్వహణకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని నడుపుతున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరి కొందరు బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చదవండి: విదేశాంగశాఖలో హనీట్రాప్‌ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్‌ పన్నాగం

Advertisement
 
Advertisement
Advertisement