నూతన్‌ నాయుడు భార్యపై కేసు నమోదు | Case filed against Nutan Naidu wife madhupriya over tonsured dalit head | Sakshi
Sakshi News home page

నూతన్‌ నాయుడు భార్యపై కేసు నమోదు

Aug 29 2020 9:22 AM | Updated on Aug 29 2020 2:10 PM

Case filed against Nutan Naidu wife madhupriya over tonsured dalit head - Sakshi

సాక్షి, విశాఖ : దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. (నూతన్‌ నాయుడు ఇంట్లో నిర్వాకం)

కాగా విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement