పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తల్లిదండ్రుల ఎంట్రీతో..

Case against Young man who was Deceived by the name of love at Tupran - Sakshi

సాక్షి, మెదక్‌ (తూప్రాన్‌): యువతిని ప్రేమించి పెళ్లి చేసుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదైంది. మంగళవారం ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్‌ మండలం కోనాయపల్లి(పీటీ) గ్రామ పంచాయతీ పరిధి ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన భాషబోయిన తేజశ్రీ, అదే గ్రామానికి చెందిన సాయిరెడ్డిగారి యశ్వంత్‌రెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరి పెళ్లికి కులాలు అడ్డు రావడంతో కుల పెద్దలు నిరాకరించారు. దీంతో గతనెల 19వ తేదీన లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయం వద్ద పెళ్లి చేసుకున్నారు. తూప్రాన్‌లో కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న అబ్బాయి, కుటుంబసభ్యులు, కుల పెద్దలు 20న తూప్రాన్‌ వచ్చి అబ్బాయిని తమ వెంట తీసుకెళ్లారు.

ప్రశ్నించినందుకు యశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరిస్తున్నారని తేజశ్రీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యశ్వంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు జయరాంరెడ్డి, రమణమ్మ, అభిషేక్‌రెడ్డి, పుష్ప, శిల్ప, బల్వంత్‌రెడ్డి, మణేమ్మ, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top